తిరుమల గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఈవోగా ప్రమాణస్వీకారం చేసిన జవహర్ రెడ్డి
- టీటీడీ కొత్త ఈవోగా జవహర్ రెడ్డి
- గత ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ
- కాలినడకన తిరుమల చేరుకున్న జవహర్ రెడ్డి
ప్రమాణస్వీకారం ముగిసిన పిమ్మట ఆయన వెంటనే కార్యనిర్వహణకు ఉపక్రమించారు. దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలపై టీటీడీ అధికారులతో సమీక్ష చేపట్టారు. జవహర్ రెడ్డి ఇప్పటివరకు ఏపీ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. జవహర్ రెడ్డి టీటీడీ ఈవో పదవిలోకి రాగా, అనిల్ కుమార్ సింఘాల్ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా వెళ్లారు.