ఏపీ కరోనా బులెటిన్: కొత్తగా 42 మరణాలు, 5,292 పాజిటివ్ కేసులు

AP Corona Bulletin released
  • గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 784 కేసులు
  • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 175 మందికి పాజిటివ్
  • తాజాగా 6,102 మందికి కరోనా నయం
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలకు సంబంధించిన తాజా బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 5,292 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 784 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 175 కేసులు వచ్చాయి. తాజాగా 6,102 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, రాష్ట్రంలో 42 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఆరుగురు మరణించారు.

ఓవరాల్ గణాంకాలు చూస్తే... మొత్తం మరణాల సంఖ్య 6,128కి పెరిగింది. ఇప్పటివరకు 7,39,719 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,84,930 మందికి కరోనా నయం అయింది. ఇంకా 48,661 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Bulletin
Positive Cases
Deaths
COVID19

More Telugu News