ఢిల్లీపై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్
- ఐపీఎల్ లో నేడు బెంగళూరు వర్సెస్ ఢిల్లీ
- దుబాయ్ వేదికగా మ్యాచ్
- తాజా సీజన్ లో రాణిస్తున్న ఇరుజట్లు
కోహ్లీ ముందుండి నడిపిస్తూ తన సారథ్యంలో ఆటు సీనియర్లకు, ఇటు యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నాడు. బెంగళూరు జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. ఆడమ్ జంపా స్థానంలో మొయిన్ అలీ... గుర్ కీరత్ సింగ్ మాన్ స్థానంలో హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఆడుతున్నారు. ఇక ఢిల్లీ జట్టు కూడా శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో సత్తా చాటుతోంది. ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ కోసం ఓ మార్పుతో బరిలో దిగుతోంది. అమిత్ మిశ్రా స్థానంలో అక్షర్ పటేల్ తుదిజట్టులోకి వచ్చాడు.