బాలు 'భారతరత్న' అవార్డుకు అన్ని విధాలా అర్హుడు!: మురళీమోహన్
- హైదరాబాదులో ఎస్పీ బాలు సంస్మరణ సభ
- వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సభ
- హాజరైన మురళీమోహన్
పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా బాలు ఎంతోమంది యువ గాయకులను సినీ రంగానికి పరిచయం చేశారని మురళీమోహన్ వెల్లడించారు. బాలు 'భారతరత్న' అవార్డుకు అన్ని విధాలా అర్హుడని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ప్రధానమంత్రికి ఇప్పటికే లేఖ రాసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.