హైదరాబాద్ బోరబండలో మరోసారి ప్రకంపనలు... ఇళ్లలోంచి పరుగులు తీసిన ప్రజలు
- రెండ్రోజుల కిందట హైదరాబాదులో ప్రకంపనలు
- అప్పటికంటే ఇప్పుడు మరింత భారీ శబ్దాలు
- ప్రజల్లో తీవ్ర భయాందోళనలు
కాగా, శుక్రవారం రాత్రి పొద్దుపోయాక బోరబండ, ఇతర ప్రాంతాల్లో భూమి కంపించడం తీవ్ర కలకలం రేపింది. భారీ శబ్దాలకు భయపడిపోయిన ప్రజలు ఇళ్లలోకి వెళ్లేందుకు సాహసించలేకపోయారు. అర్ధరాత్రి దాటే వరకు రోడ్లపైనే గడిపారు. 2017 అక్టోబరులోనూ ఇలాంటి శబ్దాలే వచ్చాయని స్థానికులు అంటున్నారు.