నీవేమైనా రౌడీ ననుకుంటున్నావా?: సబ్బం హరికి మంత్రి అవంతి వార్నింగ్
- సబ్బం హరి ఇంటి ప్రహరీ కూల్చివేతపై వివాదం
- వైసీపీపై మండిపడ్డ సబ్బం హరి
- వీధి రౌడీలా మాట్లాడారన్న అవంతి
నీవేమైనా రౌడీ అనుకుంటున్నావా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ అవంతి వార్నింగ్ ఇచ్చారు. వీధి రౌడీలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జీవీఎంసీ సిబ్బందిని దుర్భాషలాడారని అన్నారు. ఆక్రమణలను కూల్చితే కక్షసాధింపులంటున్నారని... కక్షసాధింపులకు దిగాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు.
పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని ఫిర్యాదు వచ్చిందని.. నోటీసులు ఇచ్చే జీవీఎంసీ అధికారులు ఆక్రమణలను తొలగించారని అవంతి అన్నారు. రూ. 3 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించారని చెప్పారు. స్థలాన్ని ఆక్రమిస్తే విడిచిపెట్టాలా? అని ప్రశ్నించారు. వీధి రౌడీలా బూతులు మాట్లాడారని అన్నారు.