వికారాబాద్ కిడ్నాప్ కథ సుఖాంతం.. భర్తతో కలిసి వెళ్లానన్న యువతి
- 27న కిడ్నాప్ అయిన దీపిక
- తననెవరూ కిడ్నాప్ చేయలేదన్న యువతి
- కోర్టులో చెప్పేదానిని బట్టి చర్యలు ఉంటాయన్న పోలీసులు
ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా, ఈ నెల 27న సాయంత్రం పట్టణంలోని ఎమ్మార్పీ చౌరస్తా సమీపంలో దీపిక కిడ్నాప్ అయింది. ఆమె కోసం గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరు బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తననెవరూ కిడ్నాప్ చేయలేదని, కావాలనే భర్తతో కలిసి కారులో వెళ్లినట్టు దీపిక పేర్కొందని పోలీసులు తెలిపారు. కోర్టులో దీపిక చెప్పే దానిని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.