చైనా నుంచి మరో ముప్పు.. దాడికి సిద్ధంగా ‘క్యాట్ క్యూ వైరస్’: ఐసీఎంఆర్

CQV Virus Can Spread Disease In The Country ICMR Warns
  • ఆందోళన కలిగిస్తున్న ‘క్యాట్ క్యూ వైరస్’
  • పందులు, క్యూలెక్స్ జాతి దోమలను వాహకాలుగా మార్చుకుంటున్న వైరస్
  • ఫెబ్రైల్ ఆరోగ్య సమస్యలు ప్రబలే అవకాశం
చైనా నుంచి భారత్‌కు మరో ముప్పు పొంచి ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరించింది. ‘క్యాట్ క్యూ వైరస్’ (సీక్యూవీ) దాడికి సిద్ధంగా ఉందని పేర్కొంది. క్యూలెక్స్ జాతి దోమలు, పందులను ఈ వైరస్ వాహకాలుగా మార్చుకుంటుందని చైనా, తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఇప్పటికే వెల్లడైంది. భారత్‌లోనూ పందుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. ఏజిప్టీతోపాటు క్యూలెక్స్ జాతి దోమల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది.

దేశవ్యాప్తంగా 883 సీరం నమూనాలను సేకరించి వాటిని పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)లో పరీక్షించారు. ఈ సందర్భంగా రెండు నమూనాల్లో క్యాట్ క్యూ వైరస్‌ను తిప్పికొట్టే ఐజీజీ యాంటీబాడీల జాడను గుర్తించారు. ఈ వైరస్ ప్రస్తుతం ఎంతమందిలో ఉన్నదీ తెలియాలంటే మరిన్ని నమూనాలను పరీక్షించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్ వల్ల మలేరియా, డెంగ్యూ వంటి ఫెబ్రైల్ ఆరోగ్య సమస్యలు ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నారు. మనుషులతోపాటు పందులు, ఇతర జంతువుల నుంచి కూడా శాంపిళ్లను సేకరిస్తామని తెలిపారు.
Go Back to Shorts
China
India
CQV
ICMR

More Telugu News