వాడు నా సోదరుడే కాదు నా ఆరోప్రాణం: బాలు మృతిపై భావోద్వేగాలకు లోనైన కె.విశ్వనాథ్
- దేవుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదని వ్యాఖ్యలు
- బాలు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్ష
- కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచన
భగవంతుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలు తన సోదరుడే కాకుండా తన ఆరోప్రాణం కూడా అని పేర్కొన్నారు. బాలు ఇంత త్వరగా వెళ్లిపోతాడని ఊహించలేదని, ఇలాంటి సమయంలో ఏంమాట్లాడతామని ఆవేదన వెలిబుచ్చారు. "వాడి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని వాడి కుటుంబ సభ్యులు ఓర్చుకుని మళ్లీ సాధారణ స్థితికి రావాలని ఆకాంక్షిస్తున్నాను" అని కె.విశ్వనాథ్ తెలిపారు. ఇంతకంటే ఇంకేమీ మాట్లాడలేనంటూ సెలవు తీసుకున్నారు.