'మల్టిఫుల్ స్ల్కీరోసిస్' వ్యాధి గురించి ఇటీవలే విన్నా... బాధితులకు అందరూ సహకరించాలి: కీరవాణి
- మల్టిఫుల్ స్ల్కీరోసిస్ పై కీరవాణి అవగాహన ప్రయత్నం
- ఏ వయసువారికైనా, ఎప్పుడైనా రావచ్చని వెల్లడి
- మెదడు, శరీరం మధ్య అనుసంధానం దెబ్బతీస్తుందని వివరణ
దీనిపై 'ఎంఎస్ ఇండియా' సంస్థ ప్రజల్లో అవగాహన కల్పిస్తోందని కీరవాణి తెలిపారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ధైర్యంగా ఉండేలా ఇతరులు వారికి సహకరించాలని ఆయన కోరారు. ఈ వ్యాధి ఉన్న వారు యోగా, సంగీతం వంటి వాటితో కాస్త ఉపశమనం పొందవచ్చని చెప్పారు. ఈ వ్యాధి గురించి సినీనటి విద్యా బాలన్ మాట్లాడిన వీడియోను కూడా ఆయన ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.