దేశంలో 54 లక్షల మార్క్ దాటిన కరోనా కేసుల సంఖ్య
- గత 24 గంటల్లో 92,605 కేసులు వెలుగులోకి
- ఇప్పటి వరకు 86,752 మంది బలి
- యాక్టివ్‌గా 10,10,824 కేసులు
ఇక రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో 3,01,273 కేసులు యాక్టివ్‌గా ఉండగా, కర్ణాటకలో 1,01,148, ఆంధ్రప్రదేశ్‌లో 84,423, ఉత్తరప్రదేశ్‌లో 67,825, తమిళనాడులో 46,506 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం.. ఈ నెల 19 నాటికి మొత్తం 6,36,61,060 నమూనాలు పరీక్షించారు. వీటిలో 12,06,806 శాంపిళ్లను నిన్న ఒక్కరోజే పరీక్షించారు.