ఈ అరెస్టులను ఖండిస్తున్నాం.. అసలైన దోషులను తక్షణమే అదుపులోకి తీసుకోండి: నాదెండ్ల మనోహర్
- హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు
- గుడులు, రథాలపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయడం లేదు
- ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ఒక హక్కు
అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఛలో అమలాపురం కార్యక్రమానికి తమ మిత్రపక్షమైన బీజేపీ పిలుపునిచ్చిందని మనోహర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని జనసేన నేతలు, శ్రేణులను నిన్న రాత్రి నుంచి గృహనిర్బంధంలో ఉంచడం, అరెస్ట్ చేయడం, నోటీసులు జారీ చేయడం వంటివి చేస్తున్నారని... అప్రజాస్వామికమైన ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న అసలైన దోషులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.