బాబ్రీమసీదు కేసులో 30న తుది తీర్పు.. కోర్టుకు తప్పక హాజరుకావాలని అద్వానీ, జోషీలకు కోర్టు ఆదేశం!
- 1992 నాటి బాబ్రీ కేసులో తుది తీర్పు
- తీర్పును వెలువరించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు
- కోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ
గత జూలై 24న అద్వానీ స్టేట్మెంట్ ను ప్రత్యేక సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో తాను ఏ తప్పు చేయలేదని అద్వానీ చెప్పారు. మరోవైపు విచారణ తర్వాత ఉమా భారతి స్పందిస్తూ తనకు ఎలాంటి శిక్ష పడినా అనుభవించడానికి సిద్ధమేనని అన్నారు. మరోవైపు కోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్ర వుంది.