ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. సిట్ తదుపరి చర్యలను ఆపేస్తూ ఉత్తర్వులు!
- అమరావతి భూములపై సిట్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం
- దురుద్దేశపూర్వకంగా చేస్తున్నారంటూ టీడీపీ పిటిషన్
- ఒక ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃసమీక్షించే అధికారం మరో ప్రభుత్వానికి లేదన్న న్యాయవాది
దీనిపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజాలు హైకోర్టును ఆశ్రయించారు. ఒక దురుద్దేశంతో, పక్కా ప్రణాళిక ప్రకారం ఇదంతా జరుగుతోందని తమ పిటిషన్ లో వారు ఆరోపించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం మరో ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ నేపథ్యంలో సిట్ తదుపరి చర్యలు ఆపేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.