ఏపీలో 5 వేలు దాటిన కరోనా మరణాలు

Corona death toll in AP crosses five thousand mark
  • గత 24 గంటల్లో 69 మంది మృతి
  • కొత్తగా 8,846 పాజిటివ్ కేసులు
  • 9,628 మంది డిశ్చార్జి
ఏపీలో గడచిన 24 గంటల్లో 69 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 10 మంది బలయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,041కి పెరిగింది.

తాజాగా 8,846 పాజిటివ్ కేసులు వచ్చాయి. 9,628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5,83,925కి పెరిగింది. మొత్తమ్మీద 4,86,531 మంది కరోనా నుంచి విముక్తులు కాగా, ఇంకా 92,353 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Five Thousand
Deaths
Positive Cases
COVID-19

More Telugu News