రాజకీయాలకు దూరంగా ఉంటారా? లేక చస్తారా?: కశ్మీర్ నేతలకు హిజ్బుల్ బెదిరింపు లేఖ
- రాజకీయాలకు దూరం జరిగి మాకు మద్దతివ్వండి
- ఎర్రకోటపై దాడిచేసిన మాకు మిమ్మల్ని చంపడం లెక్క కాదు
- ఇంటి కొచ్చి మరీ చంపుతాం.. జాగ్రత్త
రాజకీయాలకు అందరూ దూరంగా ఉండి తమకు మద్దుతు తెలపాలని హిబ్బుల్ ఆ లేఖలో పేర్కొంది. లేదంటే డెత్ వారెంట్లు తప్పవని హెచ్చరించింది. తమ నుంచి ఎవరూ కాపాడలేరని తేల్చి చెప్పింది. అంతేకాదు, తమ టార్గెట్‌లోకి వచ్చిన వారిని వారి ఇళ్లలోనే కాల్చి చంపుతామని హెచ్చరికలు జారీ చేసింది. ఎర్రకోటపైనే దాడిచేసిన తమను మిమ్మల్ని హతమార్చడం పెద్ద లెక్క కాదని పేర్కొంది. కాగా, ఈ లేఖతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హిజ్బుల్ ఉగ్రవాద సంస్థపై ఉపా చట్టంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.