Raghurama Krishnaraju: ఆలయాలపై దాడులకు నిరసనగా... గాంధేయ పద్ధతిలో రఘురామకృష్ణరాజు దీక్ష

Raghurama Krishnaraju announced single day protest against attacks on Hindu temples
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాను ఒక్క రోజు దీక్ష చేపడుతున్నానంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ఈ నెల 11వ తేదీన దీక్ష చేస్తున్నానని ఓ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో గాంధేయ పద్ధతిలో ఈ దీక్ష ఉంటుందని, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగిస్తానని వివరించారు. కరోనా నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఈ దీక్షకు వేదికగా తన నివాసాన్నే ఎంచుకున్నారు. ప్రతి ఒక్కరూ తన దీక్షకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Go Back to Shorts
Raghurama Krishnaraju
Protest
Attacks
Hindu Temples
Delhi

More Telugu News