జయప్రకాశ్ రెడ్డి తన నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు: ప్రధాని మోదీ
Add ap7am to your home Screen

జయప్రకాశ్ రెడ్డి తన నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు: ప్రధాని మోదీ

PM Modi condolences to the demise of Tollywood actor Jayaprakash Reddy
  • గుంటూరులో జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత
  • స్పందించిన కేంద్ర ప్రభుత్వం
  • ఎన్నో మరపురాని పాత్రలు పోషించారన్న మోదీ
  • సినీ ప్రపంచానికి తీరని లోటు అంటూ ట్వీట్
టాలీవుడ్ ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఈ ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు నిలిచిపోవడంతో జయప్రకాశ్ రెడ్డి కొంతకాలంగా గుంటూరులోని తన నివాసంలోనే ఉంటున్నారు. ఈ తెల్లవారుజామున ఛాతీలో నొప్పితో బాత్రూంలోనే కుప్పకూలిపోయారు. జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల సినీ ప్రముఖులే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది.

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. జయప్రకాశ్ రెడ్డి గారు తనదైన నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారని తెలిపారు. తన దీర్ఘకాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారని, వారి మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జయప్రకాశ్ రెడ్డి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను... ఓం శాంతి అంటూ స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల ట్వీట్ చేయడం తెలిసిందే.
Narendra Modi
Jayaprakash Reddy
Demise
Tollywood

More Telugu News