మంత్రి గౌతమ్ రెడ్డి అమాయకత్వాన్ని చూసి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడంలేదు: బుద్ధా వెంకన్న
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి నెంబర్ 1
- సీఎం జగన్ ను కలిసిన మంత్రి మేకపాటి బృందం
- గౌతమ్ కు చిన్న పరీక్ష అంటూ బుద్ధా వ్యంగ్యం
జగన్ రెడ్డి సంస్కరణల కారణంగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి నెంబర్ 1 వచ్చిందని అంటున్న గౌతమ్ కి చిన్న పరీక్ష అంటూ ట్వీట్ చేశారు. ఈ ఏడాదిన్నరలో మీ జగన్ గారు తెచ్చిన పాలసీ చూసి రాష్ట్రానికి వచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పాలి అంటూ బుద్ధా ప్రశ్నించారు.
వైసీపీ పారిశ్రామిక పాలసీతో పాటు మేకపాటి గౌతమ్ గారి కండలు చూసి క్యూ కట్టిన పారిశ్రామికవేత్తలు అని బ్లూ మీడియా వార్తలు తప్ప, క్యూ ఎక్కడ ఉందో కనపడడంలేదని ఎద్దేవా చేశారు. 'క్యూ ఎక్కడ ఉందో చెబితే ఎండకి నీరసం రాకుండా మజ్జిగ ప్యాకెట్లు పంచుతాం గౌతమ్ గారు' అంటూ బుద్ధా వ్యంగ్యం ప్రదర్శించారు.