ఏపీ కరోనా అప్ డేట్: 5 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు

Corona positive cases crosses five lakhs in AP
  • తాజాగా 8,368 మందికి పాజిటివ్
  • 5,06,493కి పెరిగిన మొత్తం కరోనా కేసులు
  • మరో 70 మంది మృతి
చైనాలో పుట్టిన కరోనా వైరస్ భూతం భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. అనేక రాష్ట్రాలను ఈ మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఏపీలోనూ ఈ వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 8,368 కొత్త కేసులు రావడంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఇప్పటివరకు ఏపీలో 5,06,493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 70 మంది మరణించారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 10 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,487కి పెరిగింది. రాష్ట్రంలో నేటికి 4,04,074 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 97,932 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
Positive Cases
Andhra Pradesh
Deaths
COVID-19

More Telugu News