Anil Kapoor: మహేశ్ బాబుకి విలన్ గా ప్రముఖ బాలీవుడ్ హీరో?

  • నెంబర్ వన్ హీరోగా రాణించిన అనిల్ కపూర్
  • 'సర్కారు వారి పాట'లో విలన్ పాత్రకి ఎంపిక 
  • పాత్రను మెచ్చిన అనిల్.. సంప్రదింపులు
  • వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం 
Anil Kapoor to play crucial role in Maheshbabus movie

నిన్నటి తరం ప్రముఖ హీరోలు కొందరు ఇప్పటికీ హీరోలుగానే కొనసాగుతున్నప్పటికీ, మరికొందరు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్ పాత్రధారులుగా మారిపోతున్నారు. తమ వయసును బట్టి, వచ్చిన ఆ అవకాశాలను అలా సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఈ కోవలో బాలీవుడ్ ప్రముఖ హీరో అనిల్ కపూర్ కూడా చేరుతున్నాడు. ఒకప్పుడు హిందీలో నెంబర్ వన్ హీరోగా రాణించిన అనిల్ ఇప్పుడు నవతరం హీరోల చిత్రాలలో ప్రత్యేక పాత్రలు పోషించడానికి ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో మహేశ్ బాబు నటించే చిత్రంలో కూడా నటించడానికి సిద్ధమవుతున్నాడు.

పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా, కీర్తి సురేశ్ కథానాయికగా 'సర్కారు వారి పాట' పేరిట ఓ భారీ చిత్రం రూపొందుతోంది. బ్యాంకు మోసాల నేపథ్యంలో సాగే కథతో రూపొందే ఈ చిత్రంలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ పాత్ర అనీ, దాని కోసం పలువురిని పరిశీలించిన మీదట అనిల్ కపూర్ ని ఎంచుకున్నారని తాజా సమాచారం. ఈ విషయంలో ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. అనిల్ కపూర్ కి కథ వినిపించగా, ఆ పాత్ర ఆయనకు నచ్చిందని కూడా అంటున్నారు. ఇక వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగును నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు.  

More Telugu News