ఏపీలో ఐదు లక్షలకు చేరువైన కరోనా పాజిటివ్ కేసులు

Corona positive cases in AP nears five lakhs
  • గత 24 గంటల్లో 10,794 కొత్త కేసులు
  • 70 మంది మృత్యువాత
  • తాజాగా 11,915 మందికి కరోనా నయం
ఏపీలో కరోనా వైరస్ బీభత్సం కొనసాగుతోంది. తాజాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలకు చేరువైంది. గడచిన 24 గంటల్లో 10,794 మందికి కరోనా నిర్ధారణ కాగా, ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,98,125కి పెరిగింది. తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మరోసారి వెయ్యికి పైగా కేసులు గుర్తించారు.

అటు, రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజులో 70 మంది మృత్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 4,417కి చేరింది. తాజాగా 11,915 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తద్వారా 3,94,019 మంది కరోనా కోరల నుంచి విముక్తులయ్యారు. ఇంకా 99,689 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడం ఊరట కలిగించే అంశం.
Go Back to Shorts
Corona Virus
Positive Cases
Andhra Pradesh
Deaths
COVID-19

More Telugu News