రైతుల జీవితాలు తాకట్టుపెడతారా.. వైఎస్ జగన్ గారూ?: దేవినేని ఉమ
- పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పలేదు
- రైతుకు నగదు బదిలీ చేయాలని చెప్పలేదు
- మినిట్స్ కాపీలో మీటర్ల మాటే లేదు
- మీటర్లు బిగించి తీరుతామంటూ మీరు అంటున్నారు
గతంలో చంద్రబాబు నాయుడు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్’ పెడతామన్నప్పుడు వైఎస్ నాయకత్వంలో కాంగ్రెస్ భారీ ఉద్యమమే నడిపిందని అందులో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారని, ఇప్పుడు మాత్రం మళ్లీ విద్యుత్ సంస్కరణల పేరిట జగన్ సర్కారు పంపుసెట్లకు మీటర్లు పెడుతోందని, నగదు బదిలీ అమలు చేయాలని నిర్ణయించిందని అందులో పేర్కొన్నారు. విమర్శలు రావడంతో కేంద్రం చెప్పింది కాబట్టి తాము చేస్తున్నామని వైసీపీ సర్కారు అంటోందని అందులో తెలిపారు.