వెయ్యికి 10 అంటూ ఆఫర్... కరోనాను కూడా లెక్కచేయకుండా దూసుకొచ్చిన జనాలు!
- చెన్నై బీసెంట్ నగర్ లో కొత్త వస్త్రదుకాణం
- ఓపెనింగ్ సందర్భంగా బంపర్ ఆఫర్
- రెండు కిలోమీటర్ల మేర జనాలతో నిండిపోయిన రోడ్డు
బంపర్ ఆఫర్ బాగా పనిచేయడంతో భారీ సంఖ్యలో జనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఈ షాపుకు వచ్చిన జనాలతో అక్కడి రోడ్డు వద్ద దాదాపు రెండు కిలోమీటర్ల మేర తీవ్ర రద్దీ ఏర్పడింది. ఈ సంగతి తెలుసుకున్న అధికారులు వెంటనే బీసెంట్ నగర్ చేరుకుని, ఆ బట్టల దుకాణం ముందు హంగామా చూసి ఆశ్చర్యపోయారు.
భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సిన ఈ సమయంలో, అత్యంత ప్రమాదకర స్థితిలో జనం గుమికూడడాన్ని చూసి నివ్వెరపోయారు. అనుమతి లేకుండా ఇదేంటని ప్రశ్నిస్తూ దుకాణదారు మురుగేశన్ పై కేసు నమోదు చేసి, దుకాణాన్ని మూసివేశారు.