ప్రేమించిన అబ్బాయిపై యాసిడ్ దాడి చేసిన కర్నూలు అమ్మాయి!
- ప్రేమించిన యువకుడు మోసం చేశాడన్న ఆగ్రహం
- మరో యువతిని పెళ్లి చేసుకున్నాడంటూ దాడి
- వారం రోజుల్లో రెండో సారి యాసిడ్ పోసిన అమ్మాయి
నాగేంద్రపై ఆ యువతి యాసిడ్ దాడి చేయడం ఇది రెండోసారి. వారం రోజుల క్రితం కూడా యువకుడిపై ఆమె యాసిడ్ పోయగా, అతడి చేయి కాలింది. ఆ గాయానికి నాగేంద్ర చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన నుంచి తన మాజీ ప్రియుడు తేరుకోకముందే ఆమె మరోసారి యాసిడ్ దాడి చేసి కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.