Onine Rummy: ఆన్ లైన్ రమ్మీపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం!

AP Govt bans online Rummy and Poker
షార్ట్స్‌లో చూడండి
సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ రమ్మీపై నిషేధం విధించింది. ఆన్ లైన్ రమ్మీతో పాటు, పోకర్ పై కూడా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

వీటిని ప్రోత్సహిస్తూ ఎక్కడైనా నిర్వాహకులు పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అంతే కాదు, మొదటి సారి పట్టుబడితే ఏడాది జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని తెలిపింది. రాష్ట్రంలో ఆన్ లైన్లో జూదం ఆడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీంతో, రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ రమ్మీని నిషేధించింది.
Go Back to Shorts
Onine Rummy
Poker
Ban
Andhra Pradesh

More Telugu News