Viral Videos: గురి తప్పని బామ్మగారి షూటింగ్.. వీడియో వైరల్!

  • బ్రిటన్‌కు చెందిన ఓ బామ్మ నైపుణ్యానికి నెటిజన్ల ఫిదా
  • ఇంట్లో సరదాగా షూటింగ్ 
  • గ్లాసును షూట్ చేయగానే కుటుంబ సభ్యుల ఆనందం 
grandmother shooting skills video goes viral

బ్రిటన్‌కు చెందిన ఓ బామ్మ(90) కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమెకు ఉన్న షూటింగ్‌ నైపుణ్యాలే ఇందుకు కారణం. త‌న మ‌నవ‌డిపై పేపర్ గ్లాస్‌ ఉంచి ఆమె బొమ్మ తుపాకీతో గురిచూసి కొట్టింది. దీంతో అందులోని బుల్లెట్టు గురి తప్పకుండా వెళ్లి ఆ గ్లాసుకి తాకడంతో అది కిందపడిపోయింది.

దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లండ్‌కు చెందిన ఓ వ్యక్తి తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేయగా ఇది తెగ వైరల్ అవుతోంది. బామ్మ స్కిల్స్‌ను నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఆమెను ఒలింపిక్స్‌కు పంపాలంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. గ్లాసును షూట్ చేయగానే ఆ బామ్మకూడా ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు ఆనందంతో గంతులేశారు.

More Telugu News