Snake: వెంటాడే పాము... ఓ కుర్రాడ్ని నెలరోజుల్లో ఎనిమిదిసార్లు కాటేసిన వైనం!

  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • ఎక్కడికి వెళ్లినా వదలని పాము
  • భయాందోళనలో పదిహేడేళ్ల కుర్రాడు
Snake bites a teenager eight times in a month

ఉత్తరప్రదేశ్ లోని బస్తి జిల్లా రాంపూర్ గ్రామంలో ఓ విడ్డూరం చోటుచేసుకుంది. ఓ టీనేజి కుర్రాడిని ఓ పాము ఒకే నెలలో ఎనిమిది సార్లు కాటేయడం చర్చనీయాంశంగా మారింది. 17 ఏళ్ల ఆ కుర్రాడి పేరు యశ్ రాజ్ మిశ్రా. ఏదో ఒకసారి పాము కరిచిందంటే అది విధివశాత్తు జరిగిందనుకోవచ్చు. కానీ ఒకే పాము పదే పదే అతడ్నే కాటేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఆ విధంగా యశ్ రాజ్... ఎనిమిదిసార్లు మృత్యుముఖంలోకి వెళ్లొచ్చాడనే చెప్పాలి. అతడు ఎక్కడున్నా సరే ఆ పాము వెంటాడుతూ, అతడ్ని కాటేసి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది.

సొంతూరు వదిలి బంధువుల గ్రామమైన బహదూర్ పూర్ వెళ్లినా, పాము అక్కడ కూడా ప్రత్యక్షమైంది. ఎప్పట్లానే కాటేసి వెళ్లిపోయింది. ఆ పాము యశ్ రాజ్ పై పగబట్టిందని గ్రామస్తులు అంటుండడంతో ఈ టీనేజర్ తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాడు. కనీసం తానెప్పుడూ ఓ పాముకు కూడా హాని చెయ్యలేదని, మరి ఈ పాము తనను ఎందుకు వెంటాడుతుందో అర్థంకాక ఆ కుర్రాడు భీతిల్లిపోతున్నాడు. పాములు పట్టుకునేవాళ్లను పురమాయించినా ఫలితం లేకపోయింది. ఆ పామును పట్టుకోవడం ఎవరి వల్లా కావడంలేదట.

More Telugu News