Girl: తన ఫోన్ ఎత్తుకుపోతున్న స్నాచర్ పై ఓ అమ్మాయి వీరోచిత పోరాటం... వీడియో ఇదిగో!

  • పంజాబ్ లోని జలంధర్ లో ఘటన
  • అమ్మాయి ఫోన్ లాగేసుకున్న స్నాచర్లు
  • వారిలో ఒకరిని పట్టుకున్న అమ్మాయి
Girl fights courageously with snatcher who grabbed her phone

పంజాబ్ లోని జలంధర్ నగరంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ వీధిలోంచి నడుచుకుంటూ వెళుతున్న అమ్మాయి నుంచి ఇద్దరు వ్యక్తులు ఫోన్ లాక్కున్నారు. ఫోన్ స్నాచింగ్ చేసి బైక్ పై పారిపోయే ప్రయత్నంలో ఉండగా, వారిలో వెనుక కూర్చున్న దొంగను ఆ అమ్మాయి గట్టిగా పట్టుకుంది. అతడు విడిపించుకునే ప్రయత్నంలో బైక్ దిగి ఆ అమ్మాయిని కొట్టసాగాడు. అయినప్పటికీ ఆ అమ్మాయి పట్టువిడవక అతడ్ని పారిపోనివ్వకుండా నిలువరించింది. ఇంతలో స్థానికులు రావడంతో ఆ దొంగ పట్టుబడ్డాడు. మరో దొంగ బైక్ పై పారిపోయాడు. ఆ అమ్మాయి సాహసాన్ని అందరూ అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


More Telugu News