Corona Virus: దేశంలో 65 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య

Singleday spike of 69921 new positive cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కొవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 69,921 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 819 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 36,91,167కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 65,288  కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 28,39,883  మంది కోలుకున్నారు. 7,85,996  మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 4,33,24,834 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,16,920 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News