Samanta: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • మరో తమిళ చిత్రానికి ఓకే చెప్పిన సమంత 
  • కొరటాల శివ సినిమాలో బాలీవుడ్ భామ
  • వెబ్ సీరీస్ లోకి అడుగు పెడుతున్న విక్రమ్      
Samanta gives nod for another Tamil flick

*  అందాలతార సమంత తమిళంలో నయనతారతో కలిసి ఇప్పటికే ఓ చిత్రంలో నటిస్తోంది. మరోపక్క, తాజాగా మరో తమిళ చిత్రానికి ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గౌతమ్ అనే నూతన దర్శకుడు వినిపించిన కథ నచ్చడంతో నటించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.
*  ప్రస్తుతం చిరంజీవితో 'ఆచార్య' చిత్రాన్ని చేస్తున్న దర్శకుడు కొరటాల శివ ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఓ చిత్రం చేయనున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పని కూడా జరుగుతోంది. ఇక ఇందులో కియరా అద్వానీని హీరోయిన్ గా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట.
*  తారలంతా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న తరుణమిది. సినిమాకు ప్రత్యామ్నాయంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎదగడంతో హీరోలు, హీరోయిన్లు అటువైపు దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ తమిళ కథానాయకుడు విక్రమ్ కూడా ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి ఓకే చెప్పాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ వెబ్ సీరీస్ నిర్మాణం జరుగుతుందని తెలుస్తోంది.  

More Telugu News