నిత్యానంద కైలాస దేశంలో హోటల్ ప్రారంభిస్తా: తమిళనాడు వ్యాపారవేత్త ఉత్సాహం
- కైలాస దేశాన్ని ప్రకటించిన నిత్యానంద
- రిజర్వ్ బ్యాంక్ కూడా ఏర్పాటు
- ఇటీవలే కరెన్సీ నోట్లు, నాణేలు విడుదల
మధురైలో టెంపుల్ సిటీ హోటల్ పేరిట వ్యాపారం చేస్తున్న కుమార్ మధురై జిల్లా హోటల్ యజమానుల సంఘానికి అధ్యక్షుడు కూడా. అయితే కైలాస దేశం ఏర్పాటైన నేపథ్యంలో, తనకు ఆ దేశంలో హోటల్ ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలంటూ నిత్యానందకు కుమార్ లేఖ రాశారు. మంచి భోజనం అందిస్తూ అతిథులను ఆకట్టుకోవడమే కాకుండా, దేశాభివృద్ధికి తోడ్పడతానని కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.