హిందీ తెలియనివాళ్లు బయటికి వెళ్లిపోవాలన్న ఆయుష్ విభాగం కార్యదర్శి... తమిళ సంఘాల ఆగ్రహం
- ఆన్ లైన్ సమావేశం నిర్వహించిన ఆయుష్ కార్యదర్శి
- తమిళనాడులో మరోసారి ఆగ్రహజ్వాలలు
- కేంద్రం స్పందించాలన్న కనిమొళి
తమిళులపై హిందీని ఉద్దేశపూర్వకంగా రుద్దే ప్రయత్నంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సంఘాల నేతలు మండిపడ్డారు. హిందీ భాష రాదంటూ తమిళులను ఇంకా ఎన్నాళ్లు అవమానిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారం పట్ల డీఎంకే ఎంపీ కనిమొళి కూడా స్పందించారు.
ఆయుష్ కార్యదర్శి రాజేశ్ కోటేచా వ్యాఖ్యలపై కేంద్రం స్పందించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటీవల కనిమొళికి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారిణి కనిమొళితో మాట్లాడుతూ, "మీరసలు భారతీయులేనా?" అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.