శ్రీశైలం విద్యుత్ కేంద్రం ప్రమాదంలో మహిళ మృతదేహం లభ్యం.. కేసీఆర్ తీవ్ర ఆవేదన!
- శ్రీశైలం ప్రమాదంలో ఆరు మృతదేహాలు లభ్యం
- నలుగురి మృతదేహాలు గుర్తింపు
- మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపిన కేసీఆర్
వీరిలో ముగ్గురుని ఫాతిమా, సుందర్, మోహన్ కుమార్ గా గుర్తించారు. మరో రెండు మృతదేహాలు ఎవరివో గుర్తించాల్సి ఉంది. మరో ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియలేదు. ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.