చంద్రయాన్-2కు ఏడాది... మరో ఏడేళ్లకు సరిపడా ఇంధనం ఉందన్న ఇస్రో!
- రెండవ లూనార్ మిషన్ గా చంద్రయాన్-2
- గత సంవత్సరం ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి
- ఇప్పటివరకూ చంద్రుని చుట్టూ 4,400 సార్లు పరిభ్రమణం
అయితే, చంద్రయాన్-2లోని ఆర్బిటర్ మాత్రం ఇప్పటికీ విజయవంతంగా పనిచేస్తోంది. దీనిలో 8 రకాల శాస్త్రీయ పరికరాలు ఉన్నాయని, ఇవన్నీ ఇప్పుడూ సక్రమంగానే పనిచేస్తున్నాయని, ఇంతవరకూ చంద్రయాన్-2 ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ 4,400 సార్లు పరిభ్రమించిందని ఇస్రో పేర్కొంది.
ఇది చాలా చక్కగా పనిచేస్తోందని, విడిభాగాలన్నీ కూడా సంతృప్తికరంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. ఈ ఆర్బిటర్ లో మరో ఏడేళ్లకు సరిపడా ఇంధనం ఉందని, దీని ద్వారా చంద్రునిపై మరింత కాలం పాటు పరిశోధనలు సాగించవచ్చని, ఇప్పటివరకూ ఎవరూ పెద్దగా దృష్టిపెట్టని చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేస్తున్నామని పేర్కొంది.