ప్రభాస్ 'ఆదిపురుష్'కి పక్కా షూటింగ్ ప్లానింగ్!

Shooting planning for Prabhas Adipurush
  • ప్రభాస్ తొలి హిందీ డైరెక్ట్ సినిమా 'ఆదిపురుష్'
  • ఓం రౌత్ దర్శకత్వంలో టి-సీరీస్ నిర్మాణం
  • అరవై రోజుల్లో షూటింగ్ పూర్తయ్యేలా ప్లానింగ్ 
  • ఎక్కువ భాగం షూటింగ్ స్టూడియోలోనే 
ఆదిపురుష్.. ప్రభాస్ నటిస్తున్న తొలి డైరెక్ట్ హిందీ సినిమా ఇది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ టి-సీరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటన రాగానే ఒక్కసారిగా టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సంచలనం అయింది. ఒక సౌత్ హీరోతో ఇలాంటి ప్రాజక్ట్ నిర్మించడం అనేది బాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశం అయింది. 'తానాజీ' ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి పలు విశేషాలు వెల్లడవుతున్నాయి.

ఈ క్రమంలో ఈ చిత్రం షూటింగ్ ప్లానింగ్ గురించిన విశేషం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. నాగ్ అశ్విన్ తో చేయాల్సిన చిత్రం పూర్తయిన తర్వాత సెట్స్ కు వెళ్లే ఈ చిత్రం షూటింగును కేవలం 60 రోజుల్లో పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారట. ముందుగా ప్రభాస్ తో చేయాల్సిన షూటింగును పూర్తిచేసి, ఆ తర్వాత మిగతా వారితో చేయాల్సిన షూటింగును చేస్తారట. రామాయణం ఆధారంగా రూపొందే సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో ఎక్కువగా స్టూడియోలోనే షూటింగ్ నిర్వహిస్తారని తెలుస్తోంది.

సుమారు 350 కోట్ల బడ్జెట్టుతో రూపొందే ఈ పాన్ ఇండియా మూవీలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రను పోషిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే, సీతాదేవి పాత్ర కోసం కీర్తి సురేశ్ పేరును పరిశీలిస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, చిత్రంలో నటించే ఇతర ఆర్టిస్టుల గురించి మాత్రం ఇంతవరకు అధికారికంగా ప్రకటన రాలేదు.  
Go Back to Shorts
Prabhas
T Series
Om Rauth
Saif Ali Khan

More Telugu News