Vijay Sai Reddy: రాయలసీమ రౌడీలంటున్నాడు.. అసలు ఈయనెక్కడి వాడు?: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ధ్వజం

Vijayasai Reddy fires on TDP Chief Chandrababu in the sidelines of Vizag issues
షార్ట్స్‌లో చూడండి
విశాఖ కంటకుడు చంద్రబాబు అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫేస్ బుక్ వేదికగా ధ్వజమెత్తారు. విశాఖ అభివృద్ధిని అడ్డుకోవడానికి చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదని విమర్శించారు. ఆంధ్రా ఊటీని లూటీ చేసింది కాక ఇప్పుడు కొత్తగా కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపించారు. వచ్చిన పెట్టుబడులను వెనక్కి పంపాడని, సముద్రం చీలిపోతుందని, విశాఖ రాజధాని అయితే రాయలసీమ రౌడీలొచ్చేస్తారని విషం కక్కాడంటూ మండిపడ్డారు.

ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, రాయలసీమ రౌడీలు విశాఖ వస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నాడని, అసలు ఈయన ఎక్కడివాడు? అంటూ విజయసాయి ఆగ్రహంతో ప్రశ్నించారు. తుపాను వస్తే పబ్లిసిటీ స్టంట్లకు తెగబడతాడని, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే అధికారుల కాళ్లకు అడ్డుతగలడం తప్ప తన పర్యటన వల్ల ఉపయోగం లేదని తెలిసినా తన పంథా మార్చుకోలేదని విమర్శించారు.

Go Back to Shorts
Vijay Sai Reddy
Chandrababu
Vizag
Rayalaseema

More Telugu News