హీరో సందీప్ కిషన్ నిర్మాతగా 'వివాహ భోజనంబు' సినిమా.. ప్రీలుక్ విడుదల!
- ఇప్పటికే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సందీప్
- తాజాగా 'వివాహ భోజనంబు' సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం
- రెస్టారెంట్ బిజినెస్ కూడా నిర్వహిస్తున్న సందీప్
తాజాగా నిర్మాతగా సందీప్ కిషన్ మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. 'వివాహ భోజనంబు' పేరుతో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి రామ్ అబ్బరాజు దర్శకుడు కాగా, జెమిని కిరణ్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్ విడుదల చేశారు. త్వరలోనే నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు. మరోవైపు 'ఏ1 ఎక్స్ ప్రెస్' చిత్రానికి కూడా సందీప్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.