Corona Virus: దేశంలో 25 లక్షలు దాటేసిన కరోనా వైరస్‌ కేసులు

spike of 65002 cases and 996 deaths reported in India
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా  కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. భారత్‌లో 24 గంటల్లో 65,002 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 996  మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.  
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 25,26,193కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 49,036 కి పెరిగింది. ఇక 6,68,220 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 18,08,937 మంది కోలుకున్నారు.
                                                      
కాగా, నిన్నటి వరకు మొత్తం 2,85,63,095 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 8,68,679 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News