Corona Virus: దేశంలో ఒక్కరోజులో వెయ్యికి పైగా కరోనా మరణాలు.. అంతకంతకు పెరిగిపోతోన్న కేసులు

Over 64000 cases in India in 24 hours
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా  కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. భారత్‌లో 24 గంటల్లో 64,553 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 1007 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.  
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 24,61,191కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 48,040 కి పెరిగింది. ఇక 6,61,595 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 17,51,556 మంది కోలుకున్నారు.
                                                       
కాగా, నిన్నటి వరకు మొత్తం 2,76,94,416 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 8,48,728 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News