కరోనా రోగి మృతదేహంపై 6 గంటల తర్వాత వైరస్ ఉండదని డబ్ల్యూహెచ్ఓ కూడా తెలిపింది: ఆళ్ల నాని
- నెల్లూరు జిల్లాలో ఆళ్ల నాని సమీక్ష
- కొవిడ్ రోగులతో ఆన్ లైన్ లో మాట్లాడిన మంత్రి
- కరోనా మృతదేహాల విషయంలో అపోహలు వద్దని సూచన
అయితే, కరోనా రోగి మృతదేహంపై 6 గంటల తర్వాత ఎలాంటి వైరస్ ఉండదని, ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో పాటు అనేక వైద్య సంస్థలు కూడా పేర్కొన్నాయని తెలిపారు. కరోనా రోగి దురదృష్టం కొద్దీ మరణించిన పక్షంలో నిర్భయంగా అంతిమ సంస్కారం నిర్వహించవచ్చని స్పష్టం చేశారు. ఒకవేళ కరోనా రోగుల మృతదేహాలను తీసుకు వెళ్లేందుకు ఎవరూ రాకపోతే ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటుందని తెలిపారు.