తూత్తుకుడి తండ్రీకొడుకుల లాకప్‌డెత్ కేసు: ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై కరోనాతో మృతి
- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లాకప్‌డెత్ కేసు
- మొబైల్ షాపు తెరిచారంటూ తండ్రీకొడుకులను అరెస్ట్ చేసి చిత్రహింసలు
- కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మొబైల్ షాపు తెరిచారంటూ పి. జయరాజ్ (59), ఆయన కుమారుడు జె.బెన్నిక్స్ (31)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తీవ్ర గాయాలపాలైన తండ్రీకొడుకులిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు దారుణంగా హింసించడం వల్లే వారు చనిపోయారంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యులుగా భావించిన 10 మంది పోలీసులను సస్పెండ్ చేసి కేసును సీబీఐకి అప్పగించింది. కేసు దర్యాప్తులో ఉండగానే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై పాల్‌దురై కరోనాతో కన్నుమూశారు.