Vijay Sai Reddy: నీ ఐదేళ్లపాలన కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను మార్చడానికే సరిపోయింది బాబు!: విజయసాయిరెడ్డి విమర్శలు

vijaya sai reddy slams chandra babu naidu
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కరోనా విజృంభణ నేపథ్యంలో జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడుతూ ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. గత టీడీపీ హయాంలో పోలవరం విషయంలో పనులు ముందుకు సాగలేదని ఆయన ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.

'సగం కొట్టుకుపోయిన కాఫర్ డ్యాం కట్టి పోలవరం పూర్తిచేసినట్లు బిల్డప్ ఇచ్చాడు జూమ్ బాబు. నీ ఐదేళ్లపాలన కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను మార్చడానికే సరిపోయింది బాబు. పోలవరంలో అసలు డ్యామ్ పునాదులు కూడా తమరు వేయలేదు. ప్రచారం కోసం స్పిల్ వేపై ర్యాంప్ వాక్ అంటూ డ్రామాలు రక్తి కట్టించావ్' అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Chandrababu

More Telugu News