Corona Virus: తెలంగాణలో కొత్తగా 1,896 మందికి కరోనా పాజిటివ్

Media Bulletin on status of positive cases COVID19 in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,896 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,788 మంది కోలుకోగా, 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.  

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,647కి  చేరింది. ఆసుపత్రుల్లో 22,628 మందికి చికిత్స అందుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 59,374  మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 645కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 338 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 147 కేసులు నమోదయ్యాయి.
                                     .
Go Back to Shorts
Corona Virus
COVID-19
Telangana

More Telugu News