Corona Virus: తెలంగాణలో 75 వేలు దాటిన కరోనా కేసులు

coronavirus cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కొవిడ్‌-19 కేసుల విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 2,207 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో  1,136 మంది కోలుకోగా, 12 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.  

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 75,257కి చేరింది. ఆసుపత్రుల్లో 21,417 మందికి చికిత్స అందుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 53,239 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 601కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 532 కరోనా కేసులు, రంగారెడ్డి జిల్లాలో 196 కేసులు నమోదయ్యాయి.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News