Hardhik Pandya: కొడుకును చూసి మురిసిపోయిన క్రికెటర్ హార్దిక్ పాండ్యా... ఆసుపత్రిలోనే పార్టీ!

  • గుజరాత్ లోని ఆనంద్ పట్టణంలో నటాషాకు ప్రసవం 
  • డాక్టర్ల బృందానికి హార్దిక్ దంపతుల కృతజ్ఞతలు
  • కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న హార్దిక్
Hardhik Pandya Happy Moments

తన జీవితంలోకి అడుగుపెట్టిన చిన్నారికి ఘన స్వాగతం పలుకుతూ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా ఆసుపత్రిలోనే వైద్యులకు పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన కొడుకును చేతుల్లోకి తీసుకుని మురిసిపోయిన హార్దిక్, ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకోగా, అవి వైరల్ అయ్యాయి. తన కుటుంబంలోని కొత్త సభ్యుడిని ప్రపంచంలోకి తీసుకుని వచ్చిన వైద్య బృందానికి హార్దిక్ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ల సమక్షంలో కేక్ ను కట్ చేసి, తమలోని ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట, ఈ సంవత్సరం జనవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, తొలుత వార్తలు వచ్చినట్టుగా నటాషా ప్రసవం ముంబైలో జరుగలేదు. గుజరాత్, ఆనంద్ పట్టణంలోని ఆకాంక్ష హాస్పిటల్ లో జరిగింది. 

More Telugu News