Corona Virus: దేశంలో 52,050 మందికి కొత్తగా కరోనా

CoronavirusIndia Stats for Aug 4th
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కొవిడ్‌-19 కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 52,050  మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 803 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 18,55,746కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 38,938కి పెరిగింది. 5,86,298 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 12,30,509 మంది కోలుకున్నారు.
                                                                        
కాగా, నిన్నటి వరకు మొత్తం 2,08,64,750 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)  తెలిపింది. నిన్న ఒక్కరోజులో 6,61,182 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News