Corona Virus: దేశంలో 18 లక్షల మార్కును దాటిన కరోనా కేసులు

Coronavirus Cases In India Cross 18 Lakh Mark 38135 Deaths
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కొవిడ్‌-19 కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల సంఖ్య 18 లక్షల మార్కును దాటింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 52,972 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 771 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 18,03,695కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 38,135కి పెరిగింది.  5,79,357 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 11,86,203 మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు మొత్తం 2,02,02,858 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)  తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,81,027 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.

Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News