ఏపీ ఉప సభాపతి కోన రఘుపతికి కరోనా... భార్యకు కూడా పాజిటివ్
- ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
- డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి స్వల్ప జ్వరం
- కరోనా టెస్టులో పాజిటివ్
కోన రఘుపతి అర్ధాంగికి కూడా కరోనా సోకినట్టు వైద్యపరీక్షల్లో తేలడంతో ఇద్దరూ క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కోన రఘుపతి స్వయంగా వెల్లడించారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. తద్వారా అభిమానులు, కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.