కరోనా లక్షణాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన తమిళనాడు గవర్నర్
- ఇటీవలే తమిళనాడు రాజ్ భవన్ లో కరోనా కలకలం
- 84 మందికి పాజిటివ్
- జూలై 29 నుంచి హోం ఐసోలేషన్ లో ఉన్న గవర్నర్
ఇటీవలే తమిళనాడు రాజ్ భవన్ లో కరోనా కలకలం రేగింది. గవర్నర్ సిబ్బందిలో 84 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో గవర్నర్ భన్వరిలాల్ ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. తాజాగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేరినట్టు అర్థమవుతోంది.